ఐదో వన్డే: ఐదో వన్డేలో భారత్ ఘన విజయం!
- సత్తా చాటిన ధోనీ సేన
- 7 వికెట్ల తేడాతో ‘భారత్’ విజయం
- ఐదు వన్డేల సిరీస్ 4-1తో టీమిండియా సొంతం
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు జరిగిన ఐదో వన్డేలో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన ఈ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. 42.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 243 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 242 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దీంతో, ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 4-1 ఆధిక్యంతో నిలిచి, సిరీస్ ను సొంతం చేసుకుంది. దీంతో, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ధోనీ సేన నిలిచినట్టయింది.
ఆస్ట్రేలియా స్కోర్ : 242/9
భారత్ స్కోర్ : 243/3
భారత్ బ్యాటింగ్: రహానె (61), రోహిత్ శర్మ (125), కోహ్లీ (39), కేఎం జాదవ్ 5 పరుగులతో, మనీష్ పాండే 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఆస్ట్రేలియా బౌలింగ్: కమిన్స్ - 1, జంపా - 2