ఐదో వన్డే: ఐదో వన్డే: టీమిండియా విజయలక్ష్యం 243 పరుగులు
- నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ స్కోర్: 242/9
- ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన కులదీప్ యాదవ్
భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. దీంతో, టీమిండియా విజయ లక్ష్యంగా 243 పరుగులను ఆసీస్ జట్టు నిర్దేశించింది. కాగా, కులదీప్ యాదవ్ మినహా టీమిండియా బౌలర్లందరూ ఆసీస్ జట్టు వికెట్లు పడగొట్టడం గమనార్హం.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ : డేవిడ్ వార్నర్ (53), ఫించ్ (32), స్మిత్ (16), హ్యాండ్స్ కాంబ్ (13), టీఎం హెడ్ (42), స్టాయినిస్ (46), ఎంఎస్ వేడ్ (20), జేపీ ఫాల్కనర్ (12), కూల్టర్-నీల్ డకౌట్ (0), కమిన్స్ నాటౌట్.
భారత్ బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ - 1, బుమ్రా - 2, పాండ్యా -1, కేఎం జాదవ్ -1, అక్షర్ పటేల్ - 3