: కోతులకూ.. లెక్క తక్కువ కావడానికి వీల్లేదు!
లెక్క తెలిసినది కేవలం మనకు మాత్రమే కాదు. అంటే మానవులకే కాదు. కోతులు కూడా 'లెక్క'గానే ఉంటాయి. పైగా లెక్క తక్కువైతే ఊరుకునేది లేదని అవి కూడా హెచ్చరిస్తాయి. లెక్క ఎక్కువ ఉన్న దానినే ఎంచుకుంటాయి. ఇలా కోతులు చాలా 'లెక్క'గా వ్యవహరిస్తాయనే సంగతిని తాజాగా శాస్త్రవేత్తలు ఓ అద్యయనంలో గుర్తించారు. హావభావాలు, చేతుల కదలికల్లో మనుషులను పోలి వ్యవహరించినట్లుగానే కోతులు లెక్క ఎక్కువ తక్కువలను గుర్తించడంలోనూ వ్యవహరిస్తాయని తేల్చారు.
జూలలో కోతులపై అద్యయనకారులు కొన్ని ప్రయోగాలను నిర్వహించారు. కోతుల ముందు పలు గిన్నెల్లో వేరుసెనగ గింజలు వేసి ఉంచారు. కోతులు అన్నీ ఎక్కువ సంఖ్యలో గింజలున్న గిన్నెలనే ఎంచుకున్నాయి. అనేకసార్లు ఇదే ప్రయోగం చేసినప్పటికీ... కోతులు మాత్రం లెక్క చూసుకునే ఎక్కువ ఉన్న వాటిని తీసుకుంటున్నాయి. ఇలా లెక్కలో ఎక్కువ తక్కువలను గుర్తించే టేలెంటు.. కోతుల్లో 75 శాతం వరకు చాలా కచ్చితంగా ఉన్నదని ఈ ప్రయోగం నిగ్గుతేల్చింది.