renu desai: ఒంటరిగా బతకడం కష్టమే!: రేణు దేశాయ్

  • అబద్ధం చెప్పవద్దని మా అమ్మ నేర్పించింది
  • అకీరా, నేను స్నేహితుల్లా ఉంటాం
  • కష్టంగా ఉన్నా.. ముందుకు సాగాల్సిందే

జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పవద్దనే విషయాన్ని తన తల్లి చిన్నప్పుడే తనకు నేర్పించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలిపారు. అమ్మ చెప్పిన మాటను అనుక్షణం ఆచరిస్తున్నానని... ఏనాడూ అబద్ధం చెప్పలేదని అన్నారు. తన కుమారుడు అకీరా, తాను ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటామని తెలిపారు. కూతురు ఆద్య మాత్రం తనకు కొంచెం తల్లి అనే ఫీలింగ్ ఇస్తుందని చెప్పారు.

సింగిల్ ఉమన్ గా ఉండటం కష్టమేనని... అన్ని విషయాలను తానే చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయినా... జీవితంలో జరిగిన విషయాలను మనం స్వీకరించి, ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు. 

renu desai
pawan kalyan
tollywood
  • Loading...

More Telugu News