chandrababu: ఈ రోజున ఏ పనైనా ప్రారంభించండి.. తిరుగుండదు: చంద్రబాబు
- 75 ఇంజినీరింగ్ క్లష్టర్లకు చంద్రబాబు శంకుస్థాపన
- సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేన్న సీఎం
- రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
విజయదశమి రోజున ఎలాంటి పనిని ప్రారంభించినా తిరుగుండదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో 75 ఇంజినీరింగ్ క్లస్టర్లకు ఈ రోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విజయవాడలో ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విభజనతో నష్టపోయిన ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి, ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత ఎదగాలని చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని... రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.