god egge: కొండ పెడుతున్న 'దేవుడి గుడ్లు'.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

  • దేవుడి గుడ్లు పెడుతున్న ‘చాన్‌ డా యా’ కొండ
  • కొండలోంచి బయటకు వచ్చే గుండ్రని రాళ్లు
  • వీటిని దేవుడి గుడ్లు అని చెబుతున్న స్థానికులు 

చైనాలోని ‘చాన్‌ డా యా’ అనే కొండ పెడుతున్న గుడ్లు శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు. ఈ కొండకు సమీపంలో ఉన్న గులు గ్రామ ప్రజలు 30 ఏళ్లకు ఒకసారి ఊడిపడే ఈ గుండ్రటి కొండ రాళ్లను ‘దేవుడి గుడ్లు’గా చెబుతుంటారు. వీటిని వారు అపురూపంగా తమ ఇళ్లలో భద్రపరుచుకుంటారు. వీటిని చూసేందుకు భారీ ఎత్తున పర్యాటకులు క్యూ కడుతుంటారు. శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని ఛేదించేందుకు వస్తుంటారు. ఈ కొండ మధ్యలో గుండ్రిని రాళ్లు పోగై అప్పుడప్పుడు ఇలా బయటపడుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తుందని వారు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News