శ్రేష్ఠ్: ‘సచిన్! నేనూ ‘క్రికెట్ దేవుడి’లా అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ చిన్నారి లేఖ !

  • ‘సచిన్’ సినిమా స్ఫూర్తి నిచ్చిందన్న బాలుడు శ్రేష్ట్
  • బాలుడి కలలు నిజం కావాలని కోరుకున్న సచిన్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్’. ఈ చిత్రం ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఏడాది మే లో ఈ చిత్రం విడుదలైంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ చిత్రం బాగుందని, స్ఫూర్తి నిచ్చిందంటూ సచిన్ కు వస్తున్న లేఖలు, ప్రశంసలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో సచిన్ కు శ్రేష్ట్ అనే బాలుడు ఓ లేఖ రాశాడు. ఈ లేఖను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ, ఆ లేఖలో ఆ చిన్నారి ఏమని రాశాడంటే..

‘హాయ్ ! సచిన్ టెండూల్కర్.. నా పేరు శ్రేష్ట్. మీ సినిమాను నేను మూడు సార్లు చూశాను. మీ సినిమాను చాలా ఇష్టపడ్డాను. మీ నుంచి చాలా స్కిల్స్ ను నేర్చుకున్నాను. నా స్నేహితుడితో నేను క్రికెట్ ఆడాను.150 పరుగులు చేశాను. నేను పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత 200 పరుగులు చేస్తాను. మొత్తంగా 34,355 పరుగులు చేస్తాను. నేను క్రికెట్ ఆడాలని, మీలా ‘క్రికెట్ దేవుడి’లా కావాలని కోరుకుంటున్నాను’ అని ఆ లేఖలో ఆ చిన్నారి పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన సచిన్, ‘శ్రేష్ట్, నీ కలలన్నీ నిజం కావాలి! నిరంతరం కష్టపడు. నీ మృదువైన లేఖకు నా కృతఙ్ఞతలు! నాతో టచ్ లో ఉండు’ అని అన్నారు.

  • Loading...

More Telugu News