చైనా: ఉ.కొరియా, భారత్, మయన్మార్ సరిహద్దుల వెంబడి మోహరించిన చైనా భద్రతా బలగాలు
- త్వరలో చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ ఈవెంట్
- భద్రతపై చైనా దృష్టి
ఉత్తర కొరియా, భారత్, మయన్మార్ సరిహద్దుల వెంబడి చైనా తన భద్రతా బలగాలను మోహరించింది. చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కు ఐదేళ్లకు ఒకసారి పొలిటికల్ ఈవెంట్ జరుపుతారు. వచ్చే నెలలో జరగనున్న ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ-జిన్‌పింగ్ మరోసారి అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు కీలక చర్చలు జరిపి, పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంటోంది.
భారత్-చైనా మధ్య డోక్లాంలో నెలకొన్న ప్రతిష్ఠంభన ఇటీవలే సమసిన విషయం తెలిసిందే. మరోవైపు ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు పాల్పడుతుండడం, మయన్మార్ నుంచి రోహింగ్యాలను తమ భూభాగంలోకి రాకుండా చూసుకోవడం వంటి వాటిపై చైనా దృష్టి పెట్టింది.