అనుష్క శర్మ: ముంబై బీచ్ లో చెత్తా చెదారం ఏరిన అనుష్క శర్మ!

  • ‘స్వచ్ఛభారత్’లో పాల్గొన్న బాలీవుడ్ భామ
  • ‘ఇన్ స్టా గ్రామ్’ లో ఫొటోలు పోస్ట్ చేసిన నటి

‘స్వచ్ఛ భారత్’లో భాగంగా ముంబైలోని వర్సోవా బీచ్ ను బాలీవుడ్ నటి అనుష్క శర్మ శుభ్రం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పేర్కొంది. బీచ్ ను శుభ్రం చేస్తుండగా దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

‘మన దేశం మన తల్లి లాంటింది. మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రతి రోజు మన కోసం మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. కొంచెం అవగాహన, స్పృహతో ఉండటం ద్వారా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన పరిసరాల్లో జీవించే అవకాశం ఉంటుంది...

ఈ రోజు నేను నా స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి వర్సోవా బీచ్ కు వెళ్లి శుభ్రం చేశాం. బీచ్ ను శుభ్రం చేస్తూ నేను పొందిన సంతోషం అంతా ఇంతా కాదు .. మాటల్లో చెప్పలేను. మహాత్మాగాంధీ అన్నట్టు ..‘టన్నుల కొద్దీ చేసే బోధనల కన్నా మనం చేయదగ్గ పనిని చేసిచూపడం మేలు’... అందుకని, దయచేసి, మీ వంతు పాత్ర మీరు నిర్వహించండి’ అని ఆ పోస్ట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News