sivaji ganeshan: శివాజీ గణేషన్ కుటుంబానికి క్షమాపణ చెప్పిన పళనిస్వామి

  • ప్రభును కలసి క్షమాపణ చెప్పిన పళని
  • కార్యక్రమానికి పన్నీర్ సెల్వం వస్తారు
  • ముందస్తు కార్యక్రమాల వల్లే రాలేకపోతున్నా

తమిళ సినీ దిగ్గజం, దివంగత శివాజీ గణేషన్ కుటుంబానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్షమాపణ చెప్పారు. శివాజీ కుమారుడు, ప్రముఖ నటుడైన ప్రభును నేరుగా కలుసుకుని క్షమించాలని కోరారు. ముందస్తు కార్యక్రమాల కారణంగానే తాను అక్టోబర్ 1న జరగనున్న శివాజీ మెమోరియల్ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని చెప్పారు. తన తరఫున ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరవుతారని చెప్పారు.

శివాజీ గణేషన్ స్మారకాన్ని ప్రారంభించే కార్యక్రమానికి పళనిస్వామి హాజరుకావడం లేదన్న వార్తల నేపథ్యంలో, ప్రభు తీవ్రంగా స్పందించారు. తద్వారా తమ కుటుంబాన్ని, జయలలితను పళని అవమానించారని ఆయన మండిపడ్డారు. జయ బతికి ఉంటే ఆమె చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరిగి ఉండేదని చెప్పారు. ఈ క్రమంలో, పళని స్వయంగా వచ్చి, క్షమాపణలు తెలిపారు.



sivaji ganeshan
prabhu
palaniswany
  • Loading...

More Telugu News