బెంగళూరు: ఆ బంక్ లో పెట్రోల్ కొనుగోలు చేస్తే బిర్యానీ ఉచితం!

  • బెంగళూరులోని ఓ పెట్రోల్ బంక్ వినూత్న ఆలోచన
  • కనీసం రూ.250 పెట్రోల్ కొనుగోలు చేస్తేనే బిర్యానీ

పెట్రోలియం ఉత్పత్తుల రోజు వారీ సమీక్ష ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రోజుకారోజు నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, పెట్రోల్ ధరలు పెరిగిన సందర్భంలో వాహనదారులు ఇబ్బందిపడుతూ, కొంత అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ బంక్ కు వచ్చే వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని బెంగళూరులోని ఓ పెట్రోల్ బంక్ నిర్వాహకులు భావించారు.

తమ బంక్ లో ఏ మేరకు పెట్రోల్ కొనుగోలు చేశారనే అంశాన్ని ఆధారంగా చేసుకుని వినియోగదారులకు టీ, కాఫీ, సమోసా..బిర్యానీ కానుకగా ఇస్తున్నారు. బిర్యానీ దక్కించుకోవాలంటే కనీసం రూ.250 పెట్రోల్ ను వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంతకీ, ఈ ఆఫర్ ఇస్తున్న పెట్రోల్ బంక్ పేరు శ్రీవెంకటేశ్వర సర్వీస్ స్టేషన్. ఇది ఓల్డ్ మద్రాసు రోడ్డులో ఉంది. ఈ ఆఫర్ అక్టోబర్ 6వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని సమాచారం. మరో విషయమేంటంటే, కేవలం, పెట్రోల్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

  • Loading...

More Telugu News