stampide: ‘తొక్కిసలాటలో 22 మంది మృతి’ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం!

  • చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి
  • ఘటనా స్థలానికి చేరుకున్న పీయూష్ గోయల్

ముంబయి రైల్వేస్టేషన్‌లో పాద‌చారుల వంతెన‌పై జరిగిన తొక్కిసలాట ఘటనలో 22 మంది మృతి చెంద‌గా మ‌రికొంత మందికి గాయాలైన విష‌యం తెలిసిందే. మృతుల్లో 14 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటోంది. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన‌ని మోదీ అన్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారని, అవసరమైన సాయాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. మృతుల‌ కుటుంబాల‌కు ఐదు ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామ‌ని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ చెప్పారు. 

  • Loading...

More Telugu News