jc diwakar reddy: నవరత్నాలు లేవు... నాపరాళ్లు లేవు!: జగన్ పై విమర్శలు గుప్పించిన జేసీ దివాకర్ రెడ్డి

  • జగన్ నవరత్నాలు లేవు.. నాపరాళ్లు లేవు
  • ప్రతి వారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి.. పాదయాత్ర ఎలా చేస్తాడు?
  • రాజకీయాల నుంచి జగన్ తప్పుకోవడం మేలు

వైసీపీ అధినేత జగన్ పై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితే లేదని... ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటేనే మంచిదని జేసీ అన్నారు. 'జగన్ నవరత్నాలు లేవు... నాపరాళ్లు లేవు' అంటూ తీసిపారేశారు.

 జగన్ చేపట్టనున్న పాదయాత్రపై కూడా జేసీ విమర్శలు గుప్పించారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్... పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా సమస్యలను తీర్చుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చారని... అందుకే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని చెప్పారు. 2019లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

jc diwakar reddy
ananthapuram mp
jagan
ys jagan
ysrcp
Telugudesam
chandrababu naidiu
jc comments on jagan
  • Loading...

More Telugu News