Mumbai: అత్తను వేధించాడని స్టేషన్ కు తరలిస్తే.. అక్కడ మహిళా ఎస్సైని లైంగికంగా వేధించిన ఘనుడు!

  • పీకల్దాక మద్యం తాగిన సంతోష్ కాంబ్లే
  • అత్త, బావమరిది భార్యతో అసభ్య ప్రవర్తన, పోలీసులకు ఫిర్యాదు
  • పోలీస్ స్టేషన్ లో అసభ్య ప్రవర్తనతో కేసు నమోదు

పీకల్దాక మద్యం తాగి అత్తను, బావమరిది భార్యను వేధించిన ప్రబుద్ధుడ్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే అక్కడ మహిళా ఎస్సైని లైంగికంగా వేధించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని గొరాయ్ ప్రాంతానికి చెందిన సంతోష్ కాంబ్లే పీకల్దాకా మద్యం తాగి అత్తవారింటికి వచ్చాడు.

అక్కడ అత్తతోను, బావమరిది భార్యతోను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతని అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిని స్టేషన్ కు తీసుకెళ్లారు. తీరా అక్కడకు వెళ్లిన తరువాత ఆ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఎస్సైపై కూడా లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

Mumbai
charkope police station
si harassed
  • Loading...

More Telugu News