క్రికెట్: హాఫ్ సెంచరీలతో అదరగొట్టేసిన టీమిండియా ఓపెనర్లు రహానే, రోహిత్ శర్మ
- అజింక్యా రహానే 58 బంతుల్లో హాఫ్ సెంచరీ
- రోహిత్ శర్మ 42 బంతుల్లోనే అర్ధ సెంచరీ
- టీమిండియా స్కోరు 18 ఓవర్లకి 106
బెంగళూరు వన్డేలో ఆస్ట్రేలియా ఇచ్చిన 335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు అజింక్య రహానే, రోహిత్ శర్మ చక్కగా రాణిస్తున్నారు. అజింక్యా రహానే 58 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ 42 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ, అజింక్యా రహానే నిలకడైన ఆటతీరు కనబర్చుతూ 100 పరుగుల మార్కు స్కోరును దాటించారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 18 ఓవర్లకి 106 గా ఉంది.