యశ్వంత్ సిన్హా: యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిలిచిన శతృఘ్నసిన్హా

  • యశ్వంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన పనిలేదు
  • జాతీయ, పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే ఆ వ్యాఖ్యలు
  • విమర్శకులకు హితవు పలికిన శతృఘ్నసిన్హా

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారిందని, క్రమంగా క్షీణిస్తోందని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా స్పందిస్తూ, యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు.

 యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఆయన బాగా ఆలోచించే ఈ విధంగా రాశారని అన్నారు. జాతీయ ప్రయోజనాలతో పాటు, పార్టీ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని విమర్శించే వాళ్లు గ్రహించాల్సిన అవసరముందని హితవు పలికారు. కాగా, ఓ ఆంగ్ల పత్రికకు యశ్వంత్ సిన్హా ఇటీవల ఓ వ్యాసం రాశారు. దేశంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తీసుకురావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారిందని ఆ వ్యాసంలో విమర్శించారు.

  • Loading...

More Telugu News