Evacuations: అమెరికాలో దావానలం.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వైనం!

  • 2 వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలు
  • విద్యాలయాలకు సెలవు ప్రకటించిన అధికారులు

నిన్నమొన్నటి వరకు తుపాన్లతో అతలాకుతలమైన అమెరికాను ఇప్పుడు దావానలం వణికిస్తోంది. కాలిఫోర్నియాలోని చైనో హిల్స్ స్టేట్ పార్క్‌లో మొదలైన కార్చిచ్చు 1700 ఎకరాలను బూడిద చేసింది. రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సోమవారం మొదలైన కార్చిచ్చు ఇప్పుడు మరో 2 వేల ఎకరాలకు వ్యాపించింది. ఓ విమానం సహా 300 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కార్చిచ్చుపై విమానంతో నీళ్లు కుమ్మరిస్తున్నారు. దావానలం కారణంగా సమీప ప్రాంతాల్లోని విద్యాలయాలను మూసివేశారు. 11 ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసరంగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

Evacuations
fire
California
america
  • Loading...

More Telugu News