narendra modi: మోదీకి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్‌ను షేర్ చేసినందుకు సస్పెన్షన్‌కి గురైన కానిస్టేబుల్
- పోస్టు గురించి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ యాక్టివిస్ట్ బీఎస్ నందకుమార్
- హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదు
- మతకల్లోలాలు సృష్టించేలా ఉందంటూ ఆరోపణ
ఫేస్బుక్లో ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరుస్తూ ఉన్న పోస్టును షేర్ చేసినందుకు బెంగళూరులోని పొన్నంపేట పోలీసు స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ సమీల్ సస్పెన్షన్ కు గురయ్యాడు. ఆర్టీఐ యాక్టివిస్ట్ బీఎస్ నందకుమార్ ఫిర్యాదు మేరకు సమీల్ను సస్పెండ్ చేసినట్లు ఆ ప్రాంత ఎస్పీ పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
మోదీ పరిపాలనని ఉద్దేశిస్తూ `నీ లాంటి వాడు ప్రధానిగా ఉండటం నిజంగా సిగ్గుచేటు` అని అర్థం వచ్చేలా ఉన్న పోస్ట్‌ను సమీల్ ఫేస్బుక్లో షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్ కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతీశాడని పేర్కొంటూ నందకుమార్ ఫిర్యాదు చేశాడు. సమీల్కు మూడు ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయని, వాటి ద్వారా హిందూ వ్యతిరేక పోస్టులను షేర్ చేస్తూ, మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.