dera baba: జైల్లో కూలి పని చేస్తున్న డేరాబాబా.. ఫొటో మీరూ చూడండి


మహిళలపై అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ సింగ్ రామ్ రహీంకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రోహ్ తక్ జైల్లో ఉన్నారు. అందరు ఖైదీల్లాగానే జైల్లో కూలి పని చేస్తున్నారు. ఆయన చేస్తున్న పనికి గాను రోజుకు రూ. 20 కూలి ఇస్తున్నారు. అన్ స్కిల్డ్ లేబర్ గా, డైలీ లేబర్ గా డేరా బాబా పని చేస్తున్నారు.

ప్రతి రోజు ఆయన మట్టి పని చేస్తున్నారు. రోజుకు 4 నుంచి 5 గంటల సేపు పని చేస్తున్నారు. అందరి ఖైదీల్లాగానే ఆయనకూ అదే ఆహారాన్ని అందిస్తున్నారు. వార్తాపత్రికలు, టీవీని కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా హనీప్రీత్ కు సంబంధించిన సమాచారం ఆయనకు అందడం లేదు. దీంతో రాత్రిపూట కూడా ఆమెనే కలవరిస్తున్నాడట.

dera baba
gurmeet singh ram raheem
  • Loading...

More Telugu News