ఆఫ్గాన్: అమెరికా రక్షణ మంత్రి రానున్న నేపథ్యంలో.. కాబూల్ విమానాశ్రయంపై రాకెట్లతో ఉగ్రవాదుల దాడి!

  • ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటన
  • 20 నుంచి 30 రాకెట్లతో దాడి

ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు స‌మీపంలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. కాసేప‌ట్లో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటీస్ ఆ విమానాశ్ర‌యానికి వ‌స్తార‌న‌గా దాడి చేశారు. ఆఫ్గాన్‌ హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్‌ దానిశ్ ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ... ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో దాడికి తెగ‌బ‌డ్డార‌ని, అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.

ఈ విమానాశ్ర‌యానికి స‌మీపంలో 20 నుంచి 30 రాకెట్లు ప‌డ్డాయ‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. వెంట‌నే విమానాశ్రయాన్ని ఖాళీ చేయించామ‌ని తెలిపారు. పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశామ‌ని అన్నారు. ఏ ఉగ్ర‌వాద సంస్థ ఈ దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News