mp.nagesh: ఆదిలాబాద్ ఎంపీ ఇంట్లో చోరీ!

  • ఎంపీ నగేష్ నివాసంలో భారీ చోరీ
  • సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఇంట్లోకి చొరబడ్డ దొంగలు
  • 15 లక్షల విలువైన ఆభరణాలు, 70,000 రూపాయల నగదు చోరీ

ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో చోరీ జరిగింది. నగేష్ ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దొంగలు ఇంట్లోకి చొరబడి 15 లక్షల రూపాయల విలువ చేసే నగలు, 70,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ సమయంలో ఎంపీ నగేష్ ఢిల్లీలో ఉన్నట్టు, ఆయన లేని విషయాన్ని తెలుసుకునే దొంగలు దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

mp.nagesh
adilabad
theft
  • Loading...

More Telugu News