mahesh babu: బెనిఫిట్ షో అంటూ మార్నింగ్ షో టికెట్లు... వినుకొండలో మహేష్ బాబు అభిమానుల వీరంగం

  • నేడు విడుదలకు సిద్ధమైన 'స్పైడర్'
  • రూ. 500కు ఒక్కో టికెట్ విక్రయించిన థియేటర్
  • ఉదయం 6 గంటలకు ప్రత్యేక ప్రదర్శన అని టికెట్ల విక్రయాలు
  • షో లేదని తెలిసి రెచ్చిపోయిన అభిమానులు

గుంటూరు జిల్లా వినుకొండలో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు వీరంగం సృష్టించారు. నేడు విడుదలకు సిద్ధమైన 'స్పైడర్' చిత్రం బెనిఫిట్ షో వేస్తామని చెప్పి తమకు టికెట్లు విక్రయించిన థియేటర్ ప్రదర్శనను ఆలస్యం చేయడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తెరను చించివేయడంతో పాటు సీట్లను ధ్వంసం చేశారు. థియేటర్ అద్దాలను రాళ్లు విసిరి పగులగొట్టారు. ఉదయం 6 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని చెప్పి తమ నుంచి రూ. 500 చొప్పున ఒక్కో టికెట్ కు వసూలు చేశారని ఈ సందర్భంగా అభిమానులు ఆరోపించారు.

 సినిమా ఆలస్యం చేస్తూ, ఉదయం 10 గంటలకే బెనిఫిట్ షో అని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో, రెచ్చిపోయారు. రిలీజ్ రోజు మార్నింగ్ షో టికెట్లనే తమకు బెనిఫిట్ షో పేరిట అధిక ధరలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను అదుపు చేశారు.

mahesh babu
spyder
vinukonda
  • Loading...

More Telugu News