ben stokes: నైట్ క్లబ్ లో తప్పతాగి ఓ వ్యక్తిని చితక్కొట్టిన ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్!

  • మరో వివాదంలో బెన్ స్టోక్స్
  • తప్పతాగి నైట్ క్లబ్ లో ఒక వ్యక్తిని చితక్కొట్టిన స్టోక్స్
  • గాయాలపాలైన బాధితుడు
  • స్టోక్స్ అరెస్టు, విడుదల

ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ దురుసు ప్రవర్తనతో మరోసారి వివాదాస్పదమయ్యాడు. తాజాగా వెస్టిండీస్ తో మూడో టెస్టు గెలిచిన సందర్భంగా బ్రిస్టల్ లోని ఒక నైట్ క్లబ్ కు వెళ్లిన బెన్ స్టోక్స్ తప్పతాగి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు బెన్ స్టోక్స్ ను అరెస్టు చేశారు. ఆ సమయంలో అతనితో పాటు అలెక్స్ హేల్స్ కూడా ఉండడం విశేషం. అయితే స్టోక్స్ ను అరెస్టు చేసిన సోమర్సెట్ పోలీసులు విచారణ అనంతరం విడిచిపెట్టారు. ప్రస్తుతానికి విడిచిపెట్టినప్పటికీ విచారణ జరుగుతుందని తెలిపారు.  

ben stokes
England
cricketer
  • Loading...

More Telugu News