మహేశ్ కత్తి: ‘జై లవకుశ’పై నేనసలు రివ్యూ చెప్పలేదు... యూ ట్యూబ్ లో వచ్చేదంతా పచ్చి అబద్ధం!: మహేశ్ కత్తి ఆగ్రహం
- జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ సినిమాపై నేను రివ్యూ చెప్పలేదు
- నా పేరును కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లు వాడుకుంటున్నాయి
- నా గొంతును అనుకరిస్తూ రివ్యూలు ఇస్తున్నాయి
- నేనసలు ‘జై లవకుశ’ సినిమానే ఇంతవరకు చూడలేదు
‘జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ సినిమాపై మహేశ్ కత్తి రివ్యూ ఏమిటో తెలుసా?'
'జై లవకుశ సినిమా మరీ ఇంత ఘోరంగా ఉంటే నేను రివ్యూ ఏమని ఇవ్వాలి?'
'ఎన్టీఆర్ సినిమాకు రివ్యూ ఇవ్వనుగాక ఇవ్వబోనన్న కత్తి’...
అంటూ యూ ట్యూబ్ లో మహేశ్ కత్తిపై ఎన్నెన్నో ఫేక్ వీడియోలు వస్తున్నాయట. అసలే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో ఇటీవల వివాదం జరిగిన నేపథ్యంలో మహేశ్ కత్తికి ఇప్పుడు ఇది మరో తలనొప్పి అయిందట.
ఆయన పేరుతో ఆయన గొంతును అనుకరిస్తూ యూ ట్యూబ్ లో ‘జై లవకుశ’ రివ్యూలు అంటూ కొన్ని వీడియోలు వస్తున్నాయట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆయనపై మండిపడుతున్నారు. ఈ ఫేక్ వీడియోలపై స్పందించిన మహేశ్ కత్తి కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లు తన వాయిస్‌ను ఎడిట్ చేసి, తాను జై లవకుశకు రివ్యూ చెప్పినట్లు పేర్కొంటున్నాయని మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఈ రోజు వరకు తాను ‘జై లవకుశ’ సినిమానే చూడలేదని, తాను బిగ్ బాస్ ఫైనల్‌షోకు హాజరయ్యేందుకు వెళ్లి వచ్చానని, ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తించాలని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతోన్న యూ ట్యూబ్ ఛానెళ్ల తీరును ఖండిస్తున్నట్లు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆయన పేర్కొన్నారు.