ప్రియాంక చోప్రా: నాకు చాలా కష్టమైన ఇంటర్వ్యూల్లో ఇదొకటి: ప్రియాంక చోప్రా

* ‘లింక్డిన్’ ఇంటర్వ్యూలో ప్రియాంకపై నలుగురు విద్యార్థుల ప్రశ్నల వర్షం

* చాలా ఒత్తిడికి గురయ్యానన్న బాలీవుడ్ బ్యూటీ


తన అందచందాలతో, అభినయంతో ప్రేక్షకులను మైమరపించే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎలాంటి ప్రశ్నలకైనా తనదైన శైలిలో సమాధానమిస్తుంది. తాజాగా ఈ చిన్నది, ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ 'లింక్డిన్' టాప్ 50 పవర్ ప్రొఫైల్స్ జాబితాకు ఎంపికైన సందర్భంగా లింక్డిన్ వేదికగా ప్రియాంక చోప్రాను నలుగురు చిన్నారులు ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూ గురించి ప్రియాంక ప్రస్తావిస్తూ, తనకు కష్టమైన ఇంటర్వ్యూల్లో ఇది కూడా ఒకటని, చాలా ఒత్తిడికి గురయ్యానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రియాంక, విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణలో కొంత భాగం..

ఓ విద్యార్థి :  మీరు యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్.. ఇంకా చాలా పనులు చేస్తుంటారు. ఫైనల్ గా మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు?
ప్రియాంక చోప్రా : ఎవిరీథింగ్. కేవలం ఒక్క అంశాన్నే ఎందుకు ఎంచుకోవాలి? మీ పాఠశాలలో ఎన్ని సబ్జెక్టులు మీరు నేర్చుకుంటున్నారు?
విద్యార్థి : చాలా సబ్జెక్స్  
ప్రియాంక చోప్రా :  మీ ఫేవరెట్ సబ్జెక్టు?
విద్యార్థి : సైన్స్  
ప్రియాంక చోప్రా :  కేవలం సైన్సేనా. ఇంకా, ఏ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం?
విద్యార్థి : ఇంగ్లీషు, మ్యాథ్స్
ప్రియాంక చోప్రా:  నీకు మూడు సబ్జెక్ట్స్ అంటే ఇష్టం. కాబట్టి, ఒకే విషయం దగ్గర ఆగిపోతామని నేను అనుకోను. జీవితం అనేది చాలా అద్భుతమైంది..
అంటూ ఆ విద్యార్థులతో సంభాషించింది.

  • Loading...

More Telugu News