rakulpreet singh: భారీగా రేటు పెంచిన రకుల్ ప్రీత్ సింగ్!

  • వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబీ భామ
  • స్పైడర్ తర్వాత రేటు పెంచేసిన రకుల్
  • అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్న దర్శక నిర్మాతలు

వరుస విజయాలతో దూసుకుపోతూ, టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. అందచందాలతోనే కాకుండా, యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేస్తూ తన డిమాండ్ ను పెంచుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. ఆమె నటించిన 'స్పైడర్' సినిమా రేపు విడుదలవుతోంది. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

స్పైడర్ తర్వాత రకుల్ ప్రీత్ తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నిర్మాతను రూ. 2.5 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. స్పైడర్ మూవీ ప్రమోషన్ టైమ్ లో కూడా పలువురు తమిళ డైరెక్టర్లు ఈ అమ్మడుని కలిశారట. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమయ్యారట. 

rakulpreet singh
tollywod
kollywood
rakul preet singh remunaration
  • Loading...

More Telugu News