gurmeet singh: డేరా బాబా ధ్యానంలో ఉన్నాడంటే అర్ధం అదే!: డేరా బాబా బంధువు గోరా వెల్లడించిన వాస్తవాలు

  • మహిళాభక్తులు, సినీ నటీమణులు, హై ప్రొఫైల్ మోడల్స్ గుర్మీత్ బాబా బాధితులే 
  • హై ప్రొఫైల్ మోడల్స్ తో 15 నుంచి 20 రోజులు గడిపేవాడు 
  • వ్యవహారం బయటకు పొక్కితే చంపేస్తానని హెచ్చరికలు
  • బాబా ధ్యానంలో ఉన్నాడని చెబితే, అమ్మాయిలతో ఉన్నాడని అర్థం 

డేరాబాబా గుర్మీత్ రాం రహీం సింగ్ అరెస్టైన నాటి నుంచి రోజుకో కథనం వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బంధువు భూపిందర్ సింగ్ గోరా మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వాటి వివరాల్లోకి వెళ్తే...డేరా ఆశ్రమంలో ఉన్న మహిళా భక్తులను, హై ఫ్రొపైల్ మోడల్స్‌, ఆశ్రమానికి వచ్చే సినీ నటీమణులను బెదిరించి మరీ గుర్మీత్ అత్యాచారానికి పాల్పడేవాడని అన్నారు. హైప్రొఫైల్ మోడల్స్ ను సిర్సా లేదా ముంబై తీసుకెళ్లి 15 నుంచి 20 రోజులపాటు ఎంజాయ్ చేసేవాడని అన్నారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కితే ప్రాణం తీస్తానని హెచ్చరించేవాడని ఆయన చెప్పారు.

 ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేది ఆయన దత్తపుత్రికగా ప్రపంచానికి చూపిన హనీప్రీత్ సింగ్ అని ఆయన అన్నారు. ఒకసారి గుర్మీత్ అనుభవించిన అమ్మాయి ఆ దరిదాపుల్లో కనిపించేందుకు అంగీకరించేవాడు కాదని ఆయన తెలిపారు. అమ్మాయిలతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు తన డేరా వైపు భక్తులను రానిచ్చేవాడు కాదని ఆయన అన్నారు. ఏకాంతంగా యువతులతో గడిపేటప్పుడు, అత్యవసరం అంటూ ఎవరైనా వస్తే, బాబా ధ్యానంలో ఉన్నారని చెప్పమనేవాడని ఆయన చెప్పారు. ధ్యానంలో ఉన్నాడని చెప్పినందుకైనా ఆయన ఏనాడూ ధ్యానం చేసిన పాపాన పోలేదని తెలిపారు. కనీసం ఆయన ఏనాడూ పుస్తకం కూడా పట్టలేదని ఆయన తెలిపారు. 

gurmeet singh
hanipreet
derababa
rapes
  • Loading...

More Telugu News