panner selvam: రెండాకుల గుర్తు కోసం ఢిల్లీ వెళుతున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం

* 28న ఢిల్లీకి పయనం

* రెండు వర్గాలు విలీనమైనట్టు అధికార పత్రాలను ఈసీకి సమర్పించనున్న నేతలు

* ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా గుర్తును స్తంభింపజేసిన ఎన్నికల సంఘం


అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు రెండాకుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయి... రెండాకుల గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నారు. దీనికి సంబంధించి అధికారిక పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీల పేర్లను కూడా మార్చివేసింది. పళని నాయకత్వంలోని పార్టీని అన్నాడీఎంకే (అమ్మ) పార్టీగా, పన్నీర్ సెల్వం నాయకత్వంలోని పార్టీని అన్నాడీఎంకే (పురచ్చితలైవి)గా మార్చింది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు విలీనం కావడంతో... రెండాకుల గుర్తు కోసం ప్రయత్నాలను ఇరువురు నేతలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో, వీరిరువురూ ఢిల్లీకి వెళుతున్నారు.

  • Loading...

More Telugu News