lk advani: నేడు చెన్నైకి వెళుతున్న అద్వానీ

* జైగోపాల్ గరోడియా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూలు వార్షికోత్సవానికి హాజరు 

* కార్యక్రమానికి హాజరవుతున్న పలువురు నేతలు 

* వేడుక ముగిసిన వెంటనే ఢిల్లీకి అద్వానీ తిరుగుపయనం


బీజేపీ కురువృద్ధుడు అద్వానీ నేడు చైన్నై వెళుతున్నారు. చెన్నైలోని తాంబరంలో ఉన్న జైగోపాల్ గరోడియా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూలు వార్షికోత్సవంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ వేడుకకు అద్వానీతో పాటు రాష్ట్ర అధికార భాషాభివృద్ధి శాఖ మంత్రి మాఫోయ్ పాండ్యరాజన్, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్, లోక్ సభ సభ్యుడు కేఎన్ రామచంద్రన్, ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజా తదితరులు కూడా హాజరవుతున్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే, అద్వానీ ఢిల్లీ తిరుగుపయనమవుతారు.  

lk advani
advani
advani chenni trip
bjp
chennai
jai gopal garodia national higher secondary school
  • Loading...

More Telugu News