priest rape attempt: పూజారి అత్యాచారం చేయబోయాడని నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత!

  • దుర్గామాత ఆలయానికి రోజూ వెళ్తుండడంతో పూజారితో పరిచయం
  • వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని పూజారి శ్రీరామ్ శర్మ సలహా అడిగిన వివావాహిత
  • లాభాలు రావాలంటే ప్రత్యేక పూజలు చేయాలని సూచించిన శ్రీరామ్ శర్మ
  • పూజ పేరిట భర్త, కుమారుడ్ని బయటకు పంపించి వివాహితపై అత్యాచారయత్నం

పూజ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించిన ఓ పూజారి... ఓ ఇల్లాలి ముందు తన అసలు రంగు బయటపెట్టిన ఉదంతం హైదరాబాదులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు, నాచారంలోని హెచ్‌ఎంటీనగర్‌ కు చెందిన మహిళ స్థానిక దుర్గామాత ఆలయానికి వెళ్తుండేది. భక్తితో తరచుగా ఆలయానికి వెళ్లడంతో ఆలయ పూజారి శ్రీరామ్‌ శర్మతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఏం చేస్తే నష్టాల నుంచి బయటపడవచ్చని ఆమె శ్రీరామ్ శర్మను సలహా అడిగింది.

దీనిని అవకాశంగా తీసుకున్న ఆయన వ్యూహం రచించాడు. దీంతో తాను చెప్పిన పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. సెప్టెంబర్ 14న ఆమె ఇంటికి వెళ్లి పూజ నిర్వహించాడు. పూజ సమయంలో తాను, ఆమె మాత్రమే ఉండాలని చెప్పడంతో ఆమె భర్త, కుమారుడు ఇంటి బయట ఉన్నారు. ఇంతలో ఇంట్లోనుంచి ఆమె అరుపులు వినిపించడంతో వారిద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ జరిగినది చూసి, పూజారికి బుద్ధి చెప్పారు. తరువాత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాచారం పోలీసులు శ్రీరామ్‌ శర్మపై ఐపీసీ సెక్షన్లు 354, 420 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

priest rape attempt
Hyderabad
nacharam ps
  • Loading...

More Telugu News