sada: పేరు మార్చుకున్న సినీ నటి సదా.. ఇకనైనా కలిసొచ్చేనా!

  • న్యూమరాలజిస్టు సలహా మేరకు పేరు మార్చుకున్న సదా
  • సదా ఇకపై సధా సయ్యద్
  • 'జయం' సినిమాతో తెరంగేట్రం 
  • 'అపరిచితుడు', 'చుక్కల్లో చంద్రుడు', 'ఔనన్నా కాదన్నా' వంటి సినిమాల్లో నటించిన సధా

ప్రముఖ సినీ నటి సదాఫ్ తనపేరు మార్చుకుంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన ముస్లిం వైద్యుడు, బ్యాంకు ఉద్యోగినిల కుమార్తె అయిన సదా 'జయం' సినిమాతో తెరంగేట్రం చేసింది. తరువాత 'అపరిచితుడు', 'చుక్కల్లో చంద్రుడు', 'ఔనన్నా కాదన్నా' వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తాజాగా ఓ డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

వెండితెరపై నెంబర్ గేమ్ లో వెనకబడిన సదా మరోసారి సత్తాచాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక న్యూమరాలజిస్ట్‌ ను సంప్రదించింది. అతని సలహా మేరకు తన పేరును మార్చుకుంది. ఇప్పటి వరకు సదాఫ్, సదాగా ఉన్న తన పేరు ఇప్పుడు సధా సయ్యద్‌ గా మారినట్టు తెలిపింది. కొత్తపేరుతో తనకు అంతా కలిసొస్తుందని ఆశిస్తోంది. 

sada
name change
sadha
actress
  • Loading...

More Telugu News