satya nadella: టెక్నాలజీ మానవత్వాన్ని తగ్గించకూడదు: సత్య నాదెళ్ల

  • టెక్నాలజీ మానవాభివృద్ధికి, మరింత ఉత్పాదకత పెంచేందుకు ఉపయోగపడాలి
  • టెక్నాలజీ మనిషిలో సమర్థత పెంచాలి
  • మనిషిలో మానవత్వం చంపేసేదిగా ఉండకూడదు
  • ఆసక్తి రేపుతున్న సత్య నాదెళ్ల వ్యాఖ్యలు

టెక్నాలజీ మనిషిలోని మానవత్వాన్ని హరించేదిగా ఉండకూడదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో నిర్వహించిన మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, రోజురోజుకీ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోందని చెప్పారు. అయితే ఈ టెక్నాలజీ అభివృద్ధికి మరింత ఉత్పాదకత, సమర్థత పెంచాలని ఆకాంక్షించారు.

అదే సమయంలో మనిషితో సంబంధాలు కలుపుకునిపోయేలా టెక్నాలజీ ఉండాలని తెలిపారు. టెక్నాలజీ మానవత్వాన్ని తగ్గించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో వివిధ పనులకు రోబోలపై ఆధారపడడం, డ్రైవర్ లెస్ కార్లు, ఇతర రంగాల్లో యాంత్రిక విధానాలపై వినూత్న పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. 

satya nadella
Florida
Orlando
Microsoft ceo
  • Loading...

More Telugu News