గ్యాంగ్ స్టర్ నయీమ్: గ్యాంగ్ స్టర్ నయీమ్ కుటుంసభ్యులకు ఐటీ నోటీసులు

  • భువనగిరిలోని నయీమ్ నివాసానికి నోటీసులు అంటించిన అధికారులు
  • నయీమ్ భార్యకు, తల్లికి, సోదరీమణులకు నోటీసులు

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత ఆ కేసు విషయమై కొన్ని రోజుల పాటు పోలీసులు హడావిడి చేయడం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసు విషయంతో కొంత స్తబ్దత నెలకొంది. మళ్లీ తాజాగా, ఈ కేసు వ్యవహారంలో కదలిక వచ్చింది. నయీమ్ అక్రమాస్తుల విషయమై ఆదాయపన్ను శాఖాధికారులు స్పందించారు. నయీమ్ భార్యకు, తల్లికి, కుటుంబసభ్యులకు నోటీసులు పంపించారు. అయితే, భువనగిరిలోని నయీమ్ నివాసంలో ప్రస్తుతం వారి కుటుంబసభ్యులెవ్వరూ నివసించడం లేదని సమాచారం.

నయీమ్ కూడబెట్టిన అక్రమాస్తులు ఎలా వచ్చాయో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో ఉన్న నయీమ్ ఇంటికి ఈ నోటీసులను అంటించారు. మొత్తం 26 చోట్ల నయామ్ ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని, వాటిలో బినామీలు నయీమ్ భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్టు గుర్తించామని సంబంధిత అధికారుల సమాచారం.

కాగా, సుమారు ఏడాది క్రితం షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు. పలు ప్రజా సంఘాల నేతలను, పోలీస్ అధికారులను హతమార్చిన నయీమ్ పై 50కి పైగా హత్య కేసులు, వివిధ పోలీస్ స్టేషన్లలో 100కి పైగా కేసులు ఉన్నాయి. 

  • Loading...

More Telugu News