rahul: గ్రామంలో చెట్టు కింద కూర్చొని టీ తాగిన రాహుల్ గాంధీ ఫొటోలు!

  • గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
  • హ‌న్‌జ్రాపార్ గ్రామంలో తమ పార్టీ నేత కుటుంబంతో కలిసి టీ తాగిన రాహుల్

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడి ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ వారికి ద‌గ్గ‌ర‌వుతున్నారు. న‌వ్‌స‌ర్జ‌న్ యాత్ర పేరుతో కొన‌సాగుతోన్న ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న అక్క‌డి ద్వార్‌కాదిష్ మందిరాన్ని సంద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే. అనంత‌రం హ‌న్‌జ్రాపార్ గ్రామంలో ప‌ర్య‌టించిన రాహుల్ గాంధీ.. అక్క‌డ శ్రీపాల్ అంబాలియా అనే త‌మ పార్టీ నేత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చెట్టు కింద టీ తాగారు.  శ్రీపాల్ అంబాలియా త‌మ పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నార‌ని రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను రాహుల్ గాంధీ కార్యాల‌యం త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఉంచింది.

 

  • Loading...

More Telugu News