baba: హైదరాబాద్‌లో నకిలీ బాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • జ్యోతిష్యం చెబుతానంటూ ప్రజలను నమ్మిస్తోన్న బాబా
  • రంగురాళ్లను మహిమ గల రాళ్లు అని చెబుతున్న వైనం
  • చార్మినార్‌ వద్ద, అమెజాన్‌ వెబ్‌సైట్‌ నుంచి రంగురాళ్లను కొనుగోలు చేస్తోన్న బాబా

పోలీసులు మరో నకిలీ బాబా ఆట‌క‌ట్టించారు. జ్యోతిష్యం చెబుతానంటూ దరిద్రాన్ని వ‌ద‌ల‌గొడ‌తానంటూ హైద‌రాబాద్‌లోని బల్కంపేటలో ఓ బాబా జ‌నాల‌ను న‌మ్మిస్తున్నాడు. రంగురాళ్లను మహిమ గల రాళ్లు అని చెబుతున్నాడు. మంత్రాలు చ‌దువుతూ ఒక్కో రాయిని ప‌దివేల రూపాయ‌లకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నాడు. ఈ విష‌యం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు అత‌డిని అరెస్టు చేసి వివ‌రాలు తెలిపారు.

హైద‌రాబాద్‌లోని చార్మినార్‌ వద్ద, అమెజాన్‌ వెబ్‌సైట్‌ నుంచి ఆ బాబా రంగురాళ్లను కొనుగోలు చేసి త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు అంట‌గ‌డుతున్నాడ‌ని చెప్పారు. అత‌డి నుంచి మొత్తం 97 రంగురాళ్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

  • Loading...

More Telugu News