anasuya: చరణ్ కి మేనత్త పాత్రలో అదరగొట్టేయనున్న అనసూయ!

  •  'రంగస్థలం' షూటింగ్ చాలా వరకు పూర్తి 
  •  ఈ సినిమాలో అనసూయ పాత్రపై నిన్నటివరకూ సస్పెన్స్
  •  చరణ్ మేనత్తగా కనిపించనుందనేది తాజా సమాచారం
  •  అనసూయ పాత్ర చాలా కీలకమట  

చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం అనసూయను ఎంపిక చేసుకున్నారనే వార్త ఈ మధ్యనే బయటికి వచ్చింది. దాంతో ఆమె ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందా? .. లేదంటే ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందా? అనే సందేహం అందరిలో తలెత్తింది.

అయితే, ఈ సినిమాలో ఆమె చరణ్ మేనత్త పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఇది పల్లెటూరి నేపథ్యంలో కొనసాగే కథ కనుక, పల్లెటూరి స్త్రీ వేషధారణలోనే అనసూయ కనిపిస్తుందని అంటున్నారు. అనసూయ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందనీ, అందుకే ఆమె ఈ సినిమాను అంగీకరించిందని చెబుతున్నారు. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ మరింతగా పెరిగిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.   

  • Loading...

More Telugu News