shane warne: నేనామెను కొట్టలేదు.. ఆ విషయాన్ని పోలీసులు కూడా తేల్చేశారు: షేన్ వార్న్

  • వివాదం సమసిపోయింది
  • మీడియాలో వార్తలు చూసి షాక్ తిన్నాను
  • నైట్ క్లబ్ లో నేను దాడి చేయలేదు
  • పోలీసు విచారణకు పూర్తిగా సహకరించాను
  • పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలించారు
  • స్ధానికులను అడిగి తెలుసుకున్నారు
  • తనపై చర్యలు లేవని చెప్పారు

శృంగారతార తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వివాదం సమసిపోయిందని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తెలిపాడు. బ్రిటన్ లోని ఓ నైట్ క్లబ్ లో తనపై షేన్ వార్న్ దాడి చేశాడని చెబుతూ, జరిగిన సంఘటనను వివరిస్తూ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై షేన్ వార్న్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మీడియాలో వస్తున్న వార్తలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పాడు.

ఆమె కేసు పెట్టడంతో పోలీసులు తనను విచారించారని చెప్పాడు. తాను వారికి పూర్తిగా సహకరించానని తెలిపాడు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించారని, స్థానికులతో మాట్లాడారని, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని గుర్తించారని పేర్కొన్నాడు. తనపై చర్యలు లేవని పోలీసులు చెప్పారని ఆయన తెలిపాడు. పోలీసులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ వార్తలకు ఇక తెరదించాలని ఆయన మీడియాకు సూచించాడు. కాగా, షేన్ వార్న్ దురుసు ప్రవర్తనతో గతంలో చాలా సార్లు ఇబ్బందులపాలయ్యాడు. 

shane warne
valeri fox
police
police case
  • Loading...

More Telugu News