: ఇన్సులిన్ ఇంజెక్షన్ల నరకానికి విముక్తి
రోజువారీ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉండాలంటే.. ఎంతటి నరకం అనుభవించాలో చక్కెర వ్యాధి ముదిరిన వారిని అడిగితే తెలుస్తుంది. అయితే ఇలాంటి నరకం నుంచి... విముక్తి కల్పించే ఒక నానో ఇంజెక్షన్‌ను అమెరికాలో రూపొందించారు. దీనిని ఒకసారి ఇంజెక్ట్ చేస్తే మళ్లీ పదిరోజుల వరకు చక్కెర స్థాయిని సమంగా ఉంచేలా, అవసరాన్ని బట్టి ఇన్సులిన్‌ను రక్తంలోకి విడుదల చేస్తూ ఉంటుందిట. ఎలుకలపై జరిపిన పరిశోధనలు కూడా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహక ఫలితాలనిచ్చాయి.
నార్త్ కెరోలీనా యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ఇలా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వగల నానో నెట్‌వర్క్‌ను తయారుచేశారు. ఇందులో ఇన్సులిన్‌తో కూడిన ఘన కోర్, డెక్స్ట్రాన్, గ్లూకోజ్, ఆక్సిడేజ్ ఎంజైం ల నానో మిశ్రమం ఉంటుంది. వీటిమధ్య రసాయన చర్య జరిగి అవసరమైనప్పుడు ఇవి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంటాయి.