kancha ilaiah: ఓ కులం మొత్తాన్ని ఎలా కించపరుస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక విసురుగా వెళ్లిపోయిన కంచె ఐలయ్య!

  • ఓ కులాన్ని సామాజిక స్మగ్లర్లు అని ఎలా అంటారు?
  • పదే పదే అడిగినా సమాధానం చెప్పని కంచె ఐలయ్య
  • 'ఐయామ్ గోయింగ్' అంటూ లేచి వెళ్లిపోయిన వైనం

తప్పు చేసిన వ్యక్తిని టార్గెట్ చేయకుండా ఓ కులం మొత్తాన్ని కించపరిచేలా పుస్తకాలు రాయడం తప్పని ఒప్పుకుంటారా? అని పదేపదే అడిగినా, దానికి సమాధానం చెప్పలేక, తన తప్పును అంగీకరించలేని స్థితితో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, విసురుగా లేచి వెళ్లిపోయారు. ఆయన రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అన్న పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో వివాదం చెలరేగుతున్న వేళ, టీవీ9 చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆయన ఇబ్బంది పడ్డట్టు కనిపించింది.

తాను మొదటి నుంచి ఒకటే ప్రశ్న అడుగుతున్నానని, అందరినీ ఒకే గాటన ఎలా కట్టగలుగుతున్నారు? దీనికి మాత్రం సమాధానాన్ని మీరు చెప్పడం లేదు? అని యాంకర్ అడుగగా, తాను రీసెర్చ్ చేసి బుక్ రాశానని మాత్రమే చెప్పారు. ఓ కులం వాళ్లు సామాజిక స్మగ్లర్లు అని కులం మొత్తంపై అభాండాలు వేయడం ఏంటని అడుగగా, "మొత్తం జ్యుడీషియరీకి వదిలిపెట్టండి. పోలీస్ వ్యవస్థకు వదిలిపెట్టండి. మీరు మరీమరీ ఇదే అడుగుతుంటే మాత్రం... ఐయామ్ గోయింగ్" అంటూ లేచి వెళ్లిపోయారు.

kancha ilaiah
samajika smugglarlu komatollu
tv9
  • Loading...

More Telugu News