dish tv: డిష్ టీవీ దసరా బంపర్ ఆఫర్

  • ఎస్ డీ, హెచ్ డీ అనే తేడాలు ఉండవు
  •  డిష్ టీవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
  • ఇకపై హై క్వాలిటీ హెచ్ డీ ఛానెల్స్ చూస్తారు
  • దేశ వ్యాప్తంగా 12.8 మిలియన్ల డిష్ టీవీ వినియోగదారులు

దసరా, దీపావళి ధమాకా పేరుతో వ్యాపార సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తాయన్న సంగతి తెలిసిందే. తాజాగా డిష్ టీవీ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్‌ ను పురస్కరించుకుని డైరెక్ట్‌ టు హోమ్‌ సేవలనందించే డిష్‌ టీవీ ‘హెచ్డీ ఫర్‌ ఆల్‌ ఇనీషియేటివ్‌’ పేరుతో కొత్త సదుపాయం కల్పించింది. డిష్ టీవీ వినియోగదారులంతా ఇకపై హెచ్ డీ క్వాలిటీతో ఛానెల్స్ చూస్తారని తెలిపింది.

ఎస్‌ డీ, హెచ్‌ డీ అనే భేదం లేకుండా తమ వినియోగదారులందరికీ హెచ్‌ డీ ఛానల్స్‌ అందిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా ‘డిష్‌ ఎన్‌ఎక్స్‌ టీ హెచ్‌ డీ’ సెట్ టాప్ బాక్స్ ను విడుదల చేసింది. వినియోగదారుల మధ్య భేదాలు లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని డిష్ టీవీ గ్రూప్ సీఈవో అనిల్ దువా తెలిపారు. కాగా, ప్రస్తుతం తమకు 12.8 మిలియన్ల మంది హెచ్ డీ వినియోగదారులు ఉన్నారని ఆయన తెలిపారు. 

dish tv
hd tv
hd services
offer
  • Loading...

More Telugu News