బిగ్ బాస్: ‘బిగ్ బాస్’ సీజన్ -2కు సమీర్ ను హోస్ట్ గా చేయమన్న జూనియర్ ఎన్టీఆర్!
- ‘బిగ్ బాస్’ సీజన్-1 ఫైనల్ లో ఆసక్తికర సంఘటన
- నటుడు సమీర్ ను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్య
‘బిగ్ బాస్’ సీజన్ -1 ఫైనల్ షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ షో లో కొంత సేపు నటుడు సమీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ‘బిగ్ బాస్’ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లతో సమీర్ సరదాగా కాసేపు మాట్లాడాడు. అనంతరం, స్టేజ్ పైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు, సమీర్ కు ఈ నేపథ్యంలో ఆసక్తికర సంభాషణ జరిగింది.
‘ఎవరిని అడిగి మీరు హోస్ట్ గా వ్యవహరించారు?’ అని సమీర్ ని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించగా.. ‘‘బిగ్ బాస్’ నుంచి పర్మిషన్ తీసుకునే హోస్ట్ గా బాధ్యతలు స్వీకరించాను’ అని సమీర్ చెప్పాడు. దీనికి వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, ‘బిగ్ బాస్’ సీజన్-2కు నువ్వే హోస్ట్ గా చెయి’ అని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.