బిగ్ బాస్: ‘బిగ్ బాస్’ తో అర్చనకు చాలా క్రేజ్ వచ్చింది: జూనియర్ ఎన్టీఆర్

  • గ్రాండ్ గా జరుగుతున్న ‘బిగ్ బాస్’ షో ఫైనల్స్ 
  • ‘జై లవ కుశ’ హోర్డింగ్ ను అర్చన బ్యానర్ కప్పేసింది అన్న జూనియర్ ఎన్టీఆర్

‘బిగ్ బాస్’ రియాల్టీ షో ద్వారా నటి అర్చనకు మంచి క్రేజ్ వచ్చిందని ఆ షో వ్యాఖ్యాత, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ‘బిగ్ బాస్’ సీజన్ -1 నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ షో ఫైనల్ కు ఎంపికైన ఐదుగురు సభ్యుల్లో అర్చన ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంగా అర్చన గురించి జూనియర్ ఎన్టీఆర్ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ ఎదురుగా తాను నటించిన ‘జై లవ కుశ’ చిత్రం హోర్డింగ్ ను కప్పేస్తూ అర్చన బ్యానర్ ను ఏర్పాటు చేశారని, ఇంకా పలుచోట్ల అర్చన హోర్డింగ్స్ కనపడుతున్నాయని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించడం గమనార్హం. కాగా, ‘బిగ్ బాస్’ టైటిల్ సాధించేందుకు నటులు శివబాలాజీ, ఆదర్శ్, నవదీప్, హరితేజ పోటీ పడుతున్నారు.

  • Loading...

More Telugu News