బిగ్ బాస్: ‘బిగ్ బాస్’ నుంచి ఎలిమినేటై వెళ్లిన తర్వాత నా కూతురు ఏమని ప్రశ్నించిందంటే..: సంపూర్ణేష్ బాబు

  • బిగ్ బాస్ సీజన్ -1 గ్రాండ్ ఫైనల్స్ ప్రారంభం
  • జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నకు సంపూ స్పందన

బిగ్ బాస్ సీజన్ -1లో పాల్గొన్న హాస్యనటుడు సంపూర్ణేష్ బాబు గతంలో ఎలిమినేట్ అవడం తెలిసిందే. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ -1 గ్రాండ్ ఫైనల్స్ షో మొదలైంది. ఈ కార్యక్రమానికి ‘బిగ్ బాస్’ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. వీరితో బిగ్ బాస్ షో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ సరదాగా కాసేపు మాట్లాడారు.

 ఈ సందర్భంగా ప్రముఖ హాస్యనటుడు సంపూర్ణేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడు. ‘బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది?’ అని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించగా, ‘నేను ఇంటికి వెళ్లిన తర్వాత నా కూతురు నా దగ్గరకు వచ్చింది. ‘నాన్నా, నువ్వు నిజంగానే ఏడ్చావా? లేక అది టాస్కా? అని అడిగింది. ఆ మాటకు చచ్చిపోవాలనిపించింది’ అని చెప్పిన సంపూ, బిగ్ బాస్ సీజన్ -2లో కనుక తనకు అవకాశం లభిస్తే చివరి వరకు ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కాగా, ఈ రోజు మొదలైన బిగ్ బాస్ షో ఫైనల్స్ లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆటపాటలు ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News