Hariteja: హరితేజకు ఎంత తెలివి... బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే స్నేహితురాలితో కలసి గెలిపించాలని వీడియో!

  • తనను గెలిపించాలని ముందే కోరిన హరితేజ
  • 70 రోజుల క్రితం తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో

తెలుగు టీవీ ప్రేక్షకులు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు? అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం... 'బిగ్ బాస్' హౌస్ లో విజేతగా ఎవరు నిలుస్తారు? అన్న ప్రశ్నే సమాధానం అవుతుందనడంలో సందేహం లేదు. ఇక చివరి వారంలో మిగిలిన ఐదుగురిలో టైటిల్ గెలుస్తుందన్న అంచనాలు అందరిపై ఉన్నా, యాంకర్ హరితేజ మిగతావారికన్నా కొంత ముందుంది.

ఇక హరితేజ, 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్లడానికి ముందే తన తెలివితేటలకు పదును పెట్టింది. తాను ఫైనల్స్ వరకూ ఉంటానన్న నమ్మకంతో, ఆమె ముందే ఓ వీడియోను సిద్ధం చేసుకుని, తన స్నేహితురాలికి ఇచ్చింది. తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ వీడియోలో కోరింది. తన దగ్గరి సన్నిహితురాలు వింధ్యా విశాఖతో కలసి ఈ వీడియోను తీసుకుంది హరితేజ. ఆ వీడియోను ఇప్పుడు వింధ్య సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్ అయింది. తన ఫ్రెండ్ ను గెలిపించాలని కోరుతూ వింధ్య ఈ వీడియోను పోస్టు చేయగా, హరితేజ ముందస్తు తెలివిపై నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.

Hariteja
vindhya
big boss
  • Error fetching data: Network response was not ok

More Telugu News