dangal: హాంకాంగ్‌లో చరిత్ర సృష్టించిన ఆమిర్‌ఖాన్ ‘దంగల్’.. రూ.19.5 కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ చిత్రం
- విదేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించిన బాలీవుడ్ సినిమా
- హాంకాంగ్‌లో గత రికార్డులను అధిగమించిన వైనం
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'దంగల్' భారతీయ స్క్రీన్లపైనే కాకుండా విదేశాల్లో సైతం ప్రభంజనం సృష్టించింది. హాంకాంగ్‌లో అయితే కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 23.45 మిలియన్ హాంకాంగ్ డాలర్ల (దాదాపు రూ.19.5 కోట్లు) వసూలుతో రికార్డులు బ్రేక్ చేసింది.
2009లో విడుదలైన ఆమిర్ సినిమా '3 ఇడియట్స్' హాంకాంగ్‌లో 23.41 మిలియన్ హాంకాంగ్ డాలర్లు వసూలు చేయగా, ఇప్పుడు దంగల్ దానిని అధిగమించింది. హాంకాంగ్, మచ్చులలో మొత్తం 46 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యే దానికి ఇది నాలుగు రెట్లు అధికమని డిస్నీ ఇండియా స్టూడియోస్ ఉపాధ్యక్షుడు అమృతపాండే తెలిపారు.
అమెచ్యూర్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన తన ఇద్దరు కుమార్తెలు గీతా ఫొగట్, బబిత కుమారిలను ప్రపంచ స్థాయి రెజ్లర్లుగా తీర్చిదిద్దారు. సాక్షి తన్వర్, ఫాతిమా సనా షేక్, జైరా వాసిమ్ ఈ పాత్రల్లో నటించారు. దంగల్ ఇప్పటి వరకు విదేశాల్లో 217.17 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, భారత్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 297.68 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.