queen: హిందీ `క్వీన్` త‌మిళ రీమేక్ పేరు `పారిస్ పారిస్‌`!

  • హిందీలో కంగనా నాయికగా 'క్వీన్' రూపొందింది 
  • తమిళ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది
  • ప్రముఖ నటుడు రమేశ్ అరవింద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు

కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా హిందీలో వ‌చ్చిన `క్వీన్‌` చిత్రాన్ని ద‌క్షిణాదిలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కంగ‌నా పోషించిన రాణి పాత్ర‌ను కాజ‌ల్ అగ‌ర్వాల్ పోషించ‌నుంది. ఈ చిత్రానికి `పారిస్ పారిస్‌` అనే పేరును ఖరారు చేసిన‌ట్లు నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది. దీంతో పాటు సినిమాలో కాజ‌ల్ ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేసింది.

 ఈ చిత్రానికి ర‌మేశ్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. రేపు ఉద‌యం 10.00 గం.ల‌కు ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు. దీనిని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేస్తారు. మొద‌ట్లో ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌కు త‌మ‌న్నాను అనుకున్నారు, కానీ ఆమె త‌ప్పుకోవ‌డంతో ఫైన‌ల్‌గా కాజ‌ల్‌ని ఎంచుకున్నారు.

  • Loading...

More Telugu News