మిస్ టర్కీ: కిరీటం పెట్టిన 24 గంటల్లోనే తిరిగి వెనక్కి తీసుకున్న నిర్వాహకులు!
- ఇస్తాంబుల్‌లో రెండు రోజుల క్రితం జరిగిన మిస్ టర్కీ పోటీలు
- విజేతగా నిలిచిన 18 ఏళ్ల ఎతిర్ ఇసెన్
- గత ఏడాది జరిగిన తిరుగుబాటుపై ఇసెన్ వివాదాస్పద ట్వీట్
ఇస్తాంబుల్‌లో రెండు రోజుల క్రితం జరిగిన మిస్ టర్కీ 2017 పోటీల్లో 18 ఏళ్ల ఎతిర్ ఇసెన్ అనే యువతి కిరీటం సాధించింది. అయితే, కిరీటం సాధించిన ఆమె సంతోషం ఎంతో సేపు నిలవలేకపోయింది. ఎందుకంటే టర్కీ అధ్యక్షుడు రెసెప్ టైయ్యప్ ఎర్డోగాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు గత ఏడాది జరిగిన తిరుగుబాటుపై ఆమె వివాదాస్పద ట్వీట్ చేసింది.
దీంతో ఆమె కిరీటాన్ని నిర్వాహకులు 24 గంటల్లోనే తిరిగి వెనక్కి తీసుకున్నారు. గతేడాది జరిగిన తిరుగుబాటులో మరణించిన సైన్యాన్ని టర్కీ ప్రభుత్వం అమరవీరులుగా కీర్తిస్తోంటే, ఆ సైన్యం గురించి అసెస్ అభ్యంతరకర పదాలతో ట్వీట్ చేసింది. దీంతో ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకొని, తొలి రన్నరప్‌ను విజేతగా ప్రకటించారు.