kancha ilaiah: కంచ ఐలయ్య విదేశీ ఏజెంట్.. టెర్రరిస్టుల కంటే డేంజరస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ బిగాల

  • కంచ ఐలయ్య ఓ పిచ్చోడు
  • దేశాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా ఐలయ్య సిద్ధం
  • ఐలయ్య ఓ విదేశీ ఎజెంట్
  • కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు

ఆర్యవైశ్యులను కించపరుస్తూ పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మండిపడ్డారు. గత రెండు మీటింగుల్లో ఐలయ్యను ఐలయ్య గారు అంటూ తాను సంబోధించానని... కానీ ఇప్పుడు అలా పిలవలేనని ఆయన అన్నారు. పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్న ఐలయ్యను ఆసుపత్రిలో చేర్చుకోవాలని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ను తాను కోరుతున్నానని చెప్పారు. 'అయ్యా, పిచ్చోళ్లు ఎక్కడున్నా మీరు పట్టుకు పోతారు... మరి, ఇంత పెద్ద పిచ్చోడ్ని రోడ్డు మీద ఎలా వదిలేశార'ని అన్నారు. 'సూపరింటెండెంట్ గారూ, ఈ పిచ్చోడ్ని పట్టుకుపోయి, మంచి వైద్యం చేసి, పిచ్చిని పోగొట్టాల'ని కోరారు.

అమెరికా డాలర్లను ఇస్తే తీసుకోవడానికి తాను సిద్ధమంటూ ఐలయ్య చేసిన వ్యాఖ్యలు దారుణమని గణేష్ అన్నారు. దేశాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా ఈయన వెనుకాడడని మండిపడ్డారు. టెర్రరిస్టుల కంటే ఐలయ్యలాంటి వారు చాలా డేంజరస్ అని అన్నారు. విదేశీ ఏజెంట్ గా మారిన ఐలయ్య... దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిపూర్ణానంద స్వామి అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకుండా ఐలయ్య దాటవేశాడని అన్నారు. దేశద్రోహి ఐలయ్యను దేశం నుంచి తరిమికొట్టాలని ప్రధానమంత్రి మోదీని కోరుతామని చెప్పారు.   

kancha ilaiah
TRS mla
mla ganesh bigala
  • Loading...

More Telugu News