kalyan: దీపావళి తరువాత రంగంలోకి చిరూ అల్లుడు!
- సినిమాల్లోకి రావడానికి ఆసక్తిని చూపిన చిరూ అల్లుడు
- నటనలోనూ శిక్షణ పూర్తి
- ఫిజిక్ విషయంలోను జాగ్రత్తలు
- దీపావళి తరువాత ఎనౌన్స్ మెంట్
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కల్యాణ్ తో జరిగిన విషయం తెలిసిందే. వివాహ సమయంలోనే కుర్రాడు బాగున్నాడు .. హీరో అయ్యే లక్షణాలు వున్నాయనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేశారు. అయితే సినిమాల వైపుకి రావడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత కల్యాణ్ మనసు మార్చుకున్నాడో ఏమో గానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి.
ఇప్పటికే విశాఖలోని సత్యానంద్ దగ్గర నటనలో మూడు నెలల పాటు కల్యాణ్ శిక్షణ తీసుకున్నాడు. ఫిజిక్ విషయంలోను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ .. యువ దర్శకులు తీసుకొచ్చిన కథలను వింటున్నాడు. దీపావళి లోగా ఒక కథను ఓకే చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీపావళి తరువాత కల్యాణ్ హీరోగా కొత్త ప్రాజెక్టును ప్రకటించే ఆలోచనలో ఉన్నారట.