kancha ilaiah: హిందువులంతా కలసి రావాలి.. లేకపోతే ధార్మిక జనజీవన స్రవంతి నుంచి తప్పుకుంటా: పరిపూర్ణానంద స్వామి

  • ఐలయ్యపై పోటా చట్టం కింద కేసు పెట్టాలి
  • నవరాత్రుల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా
  • కార్యాచరణ వెనుక హైందవ పెద్దల ఆలోచన ఉంది

లక్ష కోట్లు ఇస్తే ఏమైనా చేస్తానన్న కంచ ఐలయ్య లాంటివారిని ప్రోత్సహించరాదని శ్రీపీఠం అధినేత పరిపూర్ణానంద స్వామి అన్నారు. ప్రొఫెసర్ గా విద్యార్థులకు మంచి బోధించాల్సిన ఐలయ్య... అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దళితులను మతం మారుస్తూ... రిజర్వేషన్లకు దూరం చేస్తున్నారని విమర్శించారు. కులాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. ఐలయ్యపై పోటా చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక ఈ పోరాటంలో హిందువులంతా తనతో కలసి రావాలని... లేకపోతే ధార్మిక జనజీవన స్రవంతి నుంచి తప్పుకుంటానని పరిపూర్ణానంద చెప్పారు. నవరాత్రులు ముగిసిన తర్వాత కీలకమైన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన కార్యాచరణ వెనుక హైందవ పెద్దల ఆలోచన ఉందని అన్నారు. 

kancha ilaiah
paripoornananda swamy
samajika smugglarlu komatollu
  • Loading...

More Telugu News